'ఏమి చెప్పను ?'........
****************
"లాస్ట్ ఇయర్ నా ఎం సి ఎ అయిపోయింది..........
నేను జాలీగా ఫ్రెండ్స్ తో ఒక టూ మంత్స్, ఊటీ ,కొడైకెనాల్,గోవా.. అన్ని ట్రిప్స్ వేసి వచ్చాను.
అంతే ! నాకు ఇంటికొచ్చిన తెల్లవారే జ్వరం పట్టుకుంది వన్ వీక్ సిక్ అయ్యాను.
మా అమ్మ దానికే నన్నూ,నా తిరుగుళ్ళని తిడుతూనే ..నాకు సేవలు చెయ్యడం బిగెన్ చేసింది. ఓన్లీ టాబ్లెట్స్, సిరప్స్,సూప్స్..మాత్రమే ఇచ్చేది. జ్వరం తగ్గాక కూడా ఒన్ వీక్ వరకూ నాకు ఏమీ పెట్టలేదు.
నాకేమో చికెన్ అంటే ఇష్టం. చికెన్ అసలే పెట్టలేదు. అందుకే నేను అలిగాను.
'నాకు ఈ రోజు నువ్వు చికెన్ వండుతావా ? లేదా ? అని అమ్మతో పోట్లాడాను.
అందుకు మా అమ్మ కూడా అలిగి 'నీకు చికెన్ కావాలా? అమ్మ కావాలా? చెప్పు' అంది.
'నాకు చికెనే కావాలి ! కానీ అది వండిపెట్టడానికి అమ్మకూడా కావాలి' అన్నాను.
'దొంగగాడిదా ! వండటానికి అమ్మ కావాలి,కానీ మంచి చెప్పడానికి అమ్మ వద్దా? అయినా నేను శనివారం చికెను వండను పో ! ఏమిచేసుకుంటావో చేసుకో అంది.
'అబ్బో మరి నువ్వు వండక పొతే నాకు రాదు మరి' అని ఆమెతో అని '
'సుబ్బూ... చికెన్ తీసుకురారా వండుకుందాం.... అన్నాను తమ్ముడితో. అబ్బా! అంతుందా మీ అక్కా తమ్ముళ్ళకి ? అయితే చూద్దాం.... ఇంకెప్పుడూ మీరు ఇద్దరూ నన్ను చికెన్ వండమని అడగొద్దు నేను ఇంక మీకు ఏమి వండి పెట్టను అంది అమ్మ.....
ఇలా ఆ రోజంతా గొడవ పడుతూనే వున్నము ఇద్దరం. కానీ చికెన్ మాత్రం వండలేదు.
తెల్లావారి ఆదివారం. నిద్ర లేవడం ఆలశ్యం నేను 'చికెనూ'... అన్నాను మా అమ్మ వండనూ.. అంది మేమే వండుకుంటాం అన్నాను. దానికి అమ్మ 'ఏడిచావులే ఈ రోజు '......'(పేరు గుర్తు లేదు) అంకుల్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వుంది లంచ్ అందరికీ అక్కడే ' అంది. మా డాడీ నా పక్కకొచ్చి 'సుమలూ.. ఆ అంకుల్ వాళ్ళు బ్రాహ్మిన్స్ రా చికెన్ వండరు' అన్నారు. అమ్మా! నిజమే ? ఎంత కుట్ర ! నన్ను చికెను తిననీయకుండ చెద్దామనా ? . నేను రాను. అన్నాను.
మా అమ్మ నాన్నవైపు కోపంగా చూసింది. అంతే ! నాన్న 'సుబ్బులూ చదువుకుంటున్నవా....?' అనుకుంటూ మా తమ్ముడి రూం లోకి వెళ్ళిపోయారు చిన్నగా. నేను వాళ్ళిద్దరిని చూసి నవ్వుకున్నాను.
మధ్యాహ్నం వాళ్ళు పార్టీకి బయలు దేరారు. అమ్మ నన్ను అడిగింది 'వస్తావా ? రావా ? అని.
నేను 'రాను' అన్నాను.
'పోవే మొండి రాకాసి' అని తమ్ముడితో 'సుబ్బూ నువ్వు రారా' అంది.
నేను వెంటనే వాడితో 'ఒరేయ్ ! నీకు అక్క చేసే చికెన్ కావాలో? పార్టిలో నెయ్యిసాంబారు కావాలో ? చెప్పరా..' అన్నాను.
వాడు 'చికెనే కావాలి' అన్నాడు. వాడితో అలా అనిపించడానికి వాడ్ని చాలా మంచి చేసుకోవాల్సి వచ్చింది ఇందంతా ముందే జరిగింది కాబట్టి అమ్మా వాళ్ళకి తెలియదు.
అందుకే వాళ్ళతో వాడు 'నా తమ్ముడు మరి' అన్నాను.
ఇద్దరూ నవ్వుతూ ' సరే జాగ్రత్తగా వండుకోండి మేము వెళ్ళి వస్తాము ' అని చెప్పి వెళ్ళారు.
మేము చికెన్ వండుకొని తిన్నాము .
సాయంత్రమయ్యింది అమ్మావాళ్ళు ఇంకా రాలేదు. ఫొన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసివుంది.
ఆ సాంబార్ అంకుల్ కి ఫోన్ చెస్తే 'ఎప్పుడో వెళ్ళిపోయారే' అన్నారు.
అప్పుడు మేము అనుకున్నాము, లవ్ బర్డ్స్ ఇద్దరూ మాకు చెప్పకుండా సినిమాకు వెళ్ళి వుంటారేమో..? అని.
కానీ.....?........?........
kaani...??? habba emayyindi vennela...ila suspense pettadam bhavyam kaadu mari :(...cheppaga nuvu sure ga RGV sishyuraaluve...doubt e ille..ne apidi da iruku...Hmmmm...
రిప్లయితొలగించండిdaily serial la baagane ekkada muginchaalo episode akkade mugistunnav...naku epudanna jeevitham meeda virakti putti dialy serial tiyyalane alochana vaste, ninne contact chesta..seial super HIT...
రిప్లయితొలగించండిఅమ్మ X నేను =
రిప్లయితొలగించండి------------
అమ్మను
అమ్మనే
------------
అమ్మమ్మనేను
------------
ఇది కదా గుణింతము , మరి అమ్మ X నేను = చికెను ఎలా అయింది సౌదర్యా?
ఈ సందబంగా మీకు మా సంఘం తరపున "సస్పెన్స్ సౌదర్య" అని బిరుదును బహూకరిస్తున్నాము
లాభంలేదు ఎలా టైపు చేసినా సంఖ్యా స్థానాలు సరిగా కనిపించడంలేదు.. సర్దుకుపోండి.
రిప్లయితొలగించండిchaalaa baagundandi mee saspens
రిప్లయితొలగించండిchiken suuparandi
రిప్లయితొలగించండిkaaani.... Kaaani emayyindi....??cheppandi twaraga...
రిప్లయితొలగించండిWaiting for the next post..
వెన్నెల గారూ.. మీ బ్లాగ్ ఈరొజె చూసాను.. అన్ని టపాలు చదివెసాను... చాలా బాగున్న్నాయి...మరో జాజిపూలు అయ్యేలా వుంది మీ బ్లాగ్..
రిప్లయితొలగించండిరాజ్ కుమార్
కిషన్,భా.రా.రే,స్మైలీ,నిధి,వేనురం అందరికీ దన్యవాదాలు. ఆలస్యంగా వాఖ్య కు బదులు రాస్తున్నందుకు క్షమించండి, కార్తీక మాసం సందర్బంగా పున్యక్షేత్రాలు దర్శించుకొని, వెన్నెల గోదారిలొ పున్యస్నానాలు చేసి వచ్చానండీ అందుకే ఈ ఆలస్యం.
రిప్లయితొలగించండిభా.రా.రే గారు ఇంతకీ నాకు అంత మంచి బిరుదు ప్రదానం చేసిన మీ సంఘం పేరెంటో చెప్పనేలేదు..?
రిప్లయితొలగించండివేనూరాం గారు మీ జాజిపూలతో నేను సరితూగలేనుగాని ఏదో నాకు రాయాలనిపించి రాస్తున్నానంతే
రిప్లయితొలగించండి