2. నాలుగు నెలలు.

4నెలలు తరువాత


ఒకరోజు నేను ఆటోలో కుర్చోని నా గురించి ఆలోచిస్తూ నేను అనివార్య కారణాల వలన సంవత్సరం మధ్యలో కాలేజి మారటం, కొత్త కాలేజిలో, కొత్త గ్రూపులో,కొత్త స్నేహితులనికలవడం, ఇలా కొత్తగా ఆటోలొ(సీట్స్ కోసం కొట్టుకొని ఇరుక్కిరుగ్గా తోసుకుంటూ కుర్చునే బస్సులో కాకుండా ), ఇంతతొరగా 6.30కి ఇంటికి రావడం (పాత కాలేజిలో ఎక్కువ గంటలు కాలేజిలొ వుండాలి, అదీ కాక వెల్లేది కాలేజి బస్సులో కాబట్టి ఉదయం 6గం కే బయలు దేరాలి సాయంత్రం 8.45కి ఇల్లుచేరటం;

ఇప్పుడు అలాకాదు దానికంటే ఈ కాలేజి తక్కువ సమయమే వుండేది. అదీ ఇది ఇంటికి దానికంటే దగ్గర కావడంతో రావాడానికి పొవడానికి అర్దగంటే సమయం) అని ఆలోచించుకుంటూ కాలేజి నుండి ఇంటికి వస్తున్నా.

ఆటో ఇంటిదగ్గర రోడ్ దగ్గరకొచ్చేసరికి ఆటో వాడు "ఇక్కడ దిగవామ్మా" అన్నాడు. అప్పుడు ఈలోకంలోకి వచ్చి "ఆ ఇక్కడే దిగాలి" అని ఆటో దిగి డబ్బులు ఇచ్చేసి వస్తుంటే ఎదురుగా వున్న నెట్ సెంటర్ నుండి ఎవరో....? ఎవరినో....? పిలుస్తున్నారనిపించి నేనూ అటు తిరిగి చూశ వారు పిలుస్తుంది నన్నే ! పిలిచేది ఎవరా !? అని దగ్గరికి వెళ్ళా...
"ఓ తమిళక్కా మీరా బాగున్నరా ? చాలా రోజులయ్యింది చూసి" అన్నాను.
" ఆ బాగున్నాను. నువ్వు ఎలావున్నవు ?" అని అడిగింది.
" నేనూ బాగున్న. మీరు ఎప్పుడొచ్చారు ఊరినుండి ?" అని అడిగాను "3డేస్ అయ్యింది.
"నువ్వేంటి ఇటువైపునుండి ఆటోలో వస్తున్నావు ?" అని అడిగింది నేను నా కాలేజి మారిన సొద మొత్తం చేప్పేసా.
తను చిన్నగా నవ్వి "అలాగా మరి మ్యాత్స్ నుండి ఆర్ట్స్ కొచ్చావ్ ఇబ్బందిగా లేదా " అని అడిగింది. "లేదు చాలా బాగుంది ప్రశాంతంగా" అన్నాను. తను చిన్నగా నవ్వింది.

"సరే అక్కా బై లేటయ్యింది వెల్తాను" అన్నను
"ఇంటికా...?"
"ఆ"
"ఎప్పుడూ ఎందుకు తొందరపడతావ్ ఇంటికి వెళ్ళడానికి అమ్మ కోప్పడుతుందా ?"
"లేదక్క కంగారు పడుతుంది" అని వచ్చేస్తూ ఎదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి
అవునక్కా మీకు తెలుగు రాదన్నరు ఎలా మాట్లాడుతున్నరు ?" అని అనడిగాను దానికి ఆమె చిన్నగా నవ్వి "నేర్చుకున్నాను" అన్నది. "నేర్చుకున్నారా? తెలుగా ? ఇంత తొందరగానా? ఎలాగబ్బా ?" అన్నాను
'అలాగేనమ్మా'! అన్నది.
కాని తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం కదా...?

" అవుననుకో కానీ నీకోసం తప్పలేదమ్మా" అంది.

"నాకోసమా? ఎందుకు?"

"నీకు తమిళ్,ఇంగ్లీష్,ఏమీ రావన్నవుగా తెలుగు తప్ప అందుకే ?"
"అందుకెందుకు?"
"మరి నీతో మాట్లాడాలి కదా అందుకే నాలుగు నెలలలో నేర్చుకున్నను" అంది.
నేను నవ్వుతూ "అబ్బా! చ్చా! నాకు అంతలేదు కాని ఇంకేదో ఉంది" అన్నాను.
దానికి తను సీరియస్ గా "అవును ఉంది" అంది ......
ఆ ఉన్నది ఏదో తెలుసుకోవాలన్న ఆక్తి నాకు ఎందుకో కలగలేదు.
అడిగినా ఆమె చెప్పదనిపించింది ఆమె మొఖం చూస్తే . అది ఆమె పర్సనల్ విషయం. అడిగితే మంచిది కాదని ' బై ' చెప్పి వచ్చేసా. అలా వచ్చేటప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్ళువుండటం నేను గమనించకపోలేదు కాని.......


నాకు ఎందుకో ఆ రోజు రాత్రంతా ఆమే కలల్లోకి వచ్చింది...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి