5. సుధామధురిమ..

"మా నాన్న 'శరవణ్ పిళ్ళై',రియలెస్టేట్ బిజినెస్, అమ్మ 'సువర్ణ ' హౌజ్ వైఫ్ డాడీ తమిళియణ్ అమ్మ హైదరాబాదీ వారిది లవ్ మ్యారేజ్.
డాడీ కి ముగ్గురు అన్నయ్యలు,... అమ్మకి ఒక అన్నయ్య ఒక తమ్ముడు వున్నారు.
డాడీ వాళ్ళ ఇంట్లో,మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ ఈ పెళ్ళి ఇష్టం లేదు. కానీ మా అమ్మా వాళ్ళ పెద్దనాన్న కూతురు మాత్రం వీళ్ళకి చాలా హెల్ప్ చేసిందట. ఆవిడ ఎవరో తెలుసా అప్పుడు హాస్టల్ లో చూసావే ! 'విజయ ' వాళ్ళ, అమ్మ. నేను పుట్టిన తరువాత డాడీకి బాగా కలిసొచ్చిందట అంటే బాగా డబ్బొచ్చిందట దాంతో పాటే వాళ్ళ చుట్టాలకి నాన్న మీద ప్రేమొచ్చింది. ఒక్కతే కూతుర్ని చిన్నప్పుడంతా మహారాణిలా పెరిగాను. నాకప్పుడు 8 సంవత్సరాలనుకుంట అప్పుడు నాకు ఒక తమ్ముడు పుట్టాడు. వాడి పేరు 'సుబ్రమణ్యణ్' వాడు పెద్ద మంకీ. అయినా ఇంట్లో ఎవ్వరమూ వాడిని ఎప్పుడూ ఏమీ అనేవాళ్ళమే కాదు మా అందరికి వాడంటే అంత ఇష్టం. మేము అంతా చాలా హ్యాపిగా వుండేవాళ్ళం. కానీ మాకు ఒక్కటే భాధగా వుండేది ఇన్ని సంవత్సరలయినా అమ్మమ్మా వాళ్ళు మాత్రం ఇంతవరకూ మాతో మాట్లాడలేదు.... ఆమె అలా చెబుతూనే వుంది..
అంతలో అమె సెల్ ఫోన్ రింగ్ అయ్యింది
అమె '1 మినిట్' అని నాతో చెప్పి.

ఫోన్ లిఫ్ట్ చేసి 'ఎస్ మధు స్పీకింగ్....సొల్లు...'ఇంకా ఏదో సొల్లుకుంటుంది .

'అదేంటి ఈమె పేరు ఏదో....... ఆ సుధా అని చెప్పింది మరి ఇప్ప్డు మధు అంటుంది ? అంటే నాతో అబద్దం చెప్పిందనమాట ! ఎందుకై వుంటుందబ్బా .....? ఇంతకీ ఇప్పుడు ఈమె చెప్పేది నిజమేనా లేక .....' ఇలా నేను ఆమె వైపే చూస్తూ అలోచిస్తున్నాను.
ఆమె ఫొన్లో మాట్లాడటం అయిపోయి 'ఏంటి అలా చూస్తున్నవ్ ? ఏమయ్యింది ? నొప్పి ఇంకా తగ్గలేదా' అంది.
అంతే అప్పటి దాకా మరిచిపోయిన నొప్పి నాకు మళ్ళీ తిరిగి గుర్తొచ్చి 'ఆ ఆ ...' అంటూ మూలుగు రాగాలు మొదలెట్టా.
'ముందు నువ్వు పడుకోమ్మా' అంది.

ఈమేంటి,ఈమె బాష ఏంటిరాబాబు పొద్దాక నన్ను అమ్మా,అమ్మా అంటుంది నేనేదో పెద్దదాన్నయినట్టు అని అనుకుంటూ పడుకున్నా. తను నా పక్కకి కుర్చీ లాక్కొని కూర్చుంది. ఇంతలో ఈమె పేరు సంగతి గుర్తొచ్చి

" అక్కా ఇంతకీ మీ పేరు సుధా నా ? మధునా ? అనడిగా.
దానికి తను నవ్వుతూ 'రెండూనూ' అంది.

'రెండూనా'! ?

"ఆ నా పేరు ' సుధామధురిమ ' 'సుధామధురిమా పిళ్ళై '" అంది .

'ఈ పిల్లి గొడవేంటీ" అన్నాను.

ఆమె కళ్ళు కొంచం పెద్దవి చేసి 'ఊ పిల్లా ? పిల్లి కాదు పిళ్ళై అది మా సర్ నేం." అంది .

'ఓ ఇంటి పేరా ?... అయితే నీ పేరు 'సుధామధురిమ' అన్న మాట .
అలా అయితే నీవి రెండు పేర్లు కాదక్కా మూడు.

"మూడా ! ఎలా ?"

"ఆ ఒకటి 'సుధా'నా , రెండు 'మధు'నా, మూడోది 'రిమా'.... మొదటి రెండూ కామన్ అక్కా మూడోది వైరైటీ, ఈ సారి నుండీ నేను 'రిమా అక్కా' అని పిలుస్తాలే" అన్నాను .

తను వెంటనే ముందుకు వొంగి 'ఓ మై స్వీట్ మాం ఇట్స్ యూ'.. అంటూ గట్టిగా నా చెంప మీద ముద్దు పెట్టుకుంది.
నేను ఒక్క సారే వుక్కిరి బిక్కిరయ్యాను ఆ హఠాత్ పరిణామానికి. 'అక్కా... ఏమయ్యింది అన్నాను ?'

'ఓహ్ సారీ మా మధర్ కూడా నన్ను ఇలాగే పిలుస్తారు అందుకని....'

ఏమనాలో తెలియక నేను చిన్న నవ్వు నవ్వాను. తను మాత్రం రెండు చేతులు మొఖానికి అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది. నాకు ఎందుకో భయం వేసింది. లేచి ఆమె చెయ్యి పట్టుకొని

'అక్కా..అక్కా' అని పిలిచాను.
తను ఒక్క క్షణం ఆగి చేతులు తీసి 'రియల్లీ సారీరా' అంది.

'ఎయ్ పిచ్చీ! దానికా ఏడుస్తున్నవ్' అంటూ నవ్వాను.

తనూ తల అడ్డంగా ఊపి 'లేదు' అంటూ నవ్వేసింది.

నేను మాట మార్చలని 'ఇప్పుడు మీ తమ్ముడు ఏం చేస్తున్నాడక్కా' అన్నాను.

'తనా 10th class'

'ఎక్కడా ?'

'మధురైలో'

'ఓహ్ మీది అ వూరే కదా ! 'అక్కా ఇంతకీ మీరేమి చదివారు'? అన్నాను.

'నేనా నాది M.C.A అయిపోయింది'

'అవునా ! అయిపోయిందా ! ఇప్పుడేమి చేస్తున్నారు ?.

'ఏమి చెయ్యటం లేదు నిన్ను చూస్తూ నీతో మాట్లడుతూ వున్నా'

'జోకా..? నిజం చెప్పండక్కా'

'అరే నిజమే చెబుతున్నా'.

'అబ్బా ఇప్పుడంటే ఇప్పుడు అని కాదు అసలు రోజూ ఏమి చేస్తుంటారు ? అని'

'అదే చెబుతున్నా ! నిన్ను చూసిన రోజు నుండీ, నీ కోసం రోజు రోడ్డు దగ్గర నిలుచొని ఎప్పుడొస్తావా ? నా వైపు ఎప్పుడు చూస్తావా ? నాతో ఎప్పుడు మాట్లాడతావా ? అని చూస్తూ వుంటాను. నాకంటే ,మా తమ్ముడి కంటే ఎక్కువగా నీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుంటాను'.

'అరే ! ఎందుకక్కా ? అలాగా ఎప్పుడూ ఏమి అడిగినా నీకోసం, నీ గురించే అంటుంటారు. ఎప్పుడడిగినా తరువాత చెబుతాను అంటారు. ఇప్పుడయినా చెప్పండక్కా నాకు అసలే భయంగా వుంటుంది మీరు అలా అంటుంటే.. చెప్పండీ ప్లీజ్...'

6 కామెంట్‌లు:

  1. వెన్నెలా నువ్విలా రిమ్ముల ( రిమా ) కథలు సస్పెన్స్ కలిపి చెపుతుంటే మేము కాలి గోళ్ళు కొరుక్కుంటున్నాము. మొత్తానికి ఏదో తేడా కేసు లాగుంది.
    కథ మధ్య మధ్యలో "సొల్లు" లు "పిల్లు"లూ అంతలోనే గుర్తొచ్చే "అమ్మ"లూ. అన్నీ కలిసి మాకు నవ్వుల పువ్వులు.

    బాగుంటున్నాయి. హానెస్ట్ ఫీలింగ్

    రిప్లయితొలగించండి
  2. భా.రా.రే గారు..సంతోషం దన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. బాగున్నాయమ్మా నీ ఫీలింగ్స్... నువ్వు చెప్పే విధానం కూడా బాగుంది... ఏమీ అనుకోనంటే చిన్న దిద్దుబాటు... అథిది దేవుళ్ళు ఎందరంటే.. అన్న దాంట్లో "అతిధి" అని రాయాలి.. "తిధి", వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా మనింటికి అనుకోకుండా, ఏ సమయంలోనయినా వచ్చేవాడే "అతిధి". అంటే మీ బ్లాగింటికి వచ్చే మాలాంటి వాళ్ళమన్న మాట.

    రిప్లయితొలగించండి
  4. Vennela, nuvvu RGV gaari sishyuraala enti kompadeesi...aayana cinemalalo suspense kante nee blog suspense ekkuvaindi..haha...good work...keep going...

    రిప్లయితొలగించండి
  5. జగదీష్ గారు దన్యవాదాలండీ.
    క్షమించాలి అది ఇప్పుడే సరి చేస్తాను. మీరూ ఏమీ అనుకోనంటే నాది చిన్న విన్నపం తెలుగు రాక ,అర్ద తాత్పర్యాలు తెలియక, అలా రాయలేదండీ.. నా బ్లాగు లో 'తెలుగు లిప్యంతీకరణ ' పని చేయడం లేదు అందుకే లేఖిని ద్వారా టైపు చేసి పెడుతున్నాను. ఈ క్రమంలో అది ఇలాంటి మర్పులకు లోనవుతుంది.

    కిషన్ గారు..మీరు మరీనూ నాకు అంత గొప్ప గొప్ప వాళ్ళతో శిష్యరికం ఉంటే నేను ఇలా ఎందుకుంటాను ? ఏదో మా సుధ తో నా అనుభందం మీలాంటి వాళ్ళతో పంచుకోవాలనిపించి రాస్తున్నాను అంతే.

    రిప్లయితొలగించండి
  6. అరే ..... మొదటి పోస్ట్ సంది చూస్తున్న .................... ఈ బ్లాగేర్ మస్తు సస్పెన్సు ..... పెడతాంది ..... ఈ ముచ్చటకి ముగింపు గిట్ల ...... లేదా ... ఏందీ ................. గీడ ... మందికి ఇస్తోరీ ... అర్ధం గాక .... దిమాక్ .... ఖరాబ్ అవుతాంది ...................... జల్ది ..... ఫినిష్ జేస్తే ..... ఖుషి అవుతాం........

    రిప్లయితొలగించండి