కొన్ని సంబంధాలు ఎందుకు ఎప్పుడు,ఎలా, ఏర్పడతాయో,అవి ఎప్పుడు ఎలా ముగుస్తాయో అర్దంకాదు. కానీ అవి మిగిల్చె ఙాపకాలెన్నో... అలాంటి బంధమే నా సుధతో నా స్నేహబంధం...
****************************
ఆ రోజు శనివారం సెకండ్ ఇంటెర్ రిసల్ట్స్ వచ్చాయి. మా కాలేజే జిల్లాఫస్ట్. ఆ ఆనందంతో కాలేజ్ యాజమాన్యం మాకు స్వీట్స్ ఇచ్చి మధ్యాన్నం కాలేజ్ నుంచి ఇంటికి పంపించేసారు. నా క్లాస్మెట్ శ్యామల వాళ్ళక్క మా ఇంటి దగ్గర ఉన్న ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో వుంటూ చదువుకుంటుంది. అందుకని తను నాతోపాటు మా ఇంటికి వచ్చి ఆ కాలేజ్ చాలా బాగుంటుందని, నాకు బాగా నచ్చుతుందని, చుట్టూ చెట్లు కూడా వుంటాయని, ఫోటోలు దిగవచ్చని, నన్నూ నాతోపాటు నా కెమేరాని కూడా వెంటపెట్టుకొని ఆ కాలేజికి తీసుకెళ్ళింది.
నేను అదే ఫస్ట్ ఆ కాలేజి లో అడుగుపెట్టడం,హాస్టల్ రూంస్ చూడటం.. గదికి నాలుగు మంచాలు, సామాను పెట్టుకోవడానికి బీరువాలు, కుర్చోడానికి,చదువుకోడానికి మంచం పక్కనే కుర్చీలతో సౌకర్యంగా ఉంది. చుట్టూ పచ్చని వాతావరణం.. అబ్బో! ఎంతబాగుందో!.. మేము వెళ్ళే సరికి ఆ రూంలో ముగ్గురున్నరు. ఒకామె శ్యామలావాళ్ళ అక్క,ఇంకొకామె వాళ్ళరూమ్మెట్ విజయ, ఇంకొకరు విజయకోసం వచ్చిన వాళ్ళ చెల్లెలు. ఆమెకూడా మాలాగే వచ్చిందట. ఆ విజయావాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నరు వారు ఏ భాష మాట్లాడుతున్నారో నాకు అర్దం కాలేదు కాసేపటివరకు. తరువాత వుండబట్టలేక , అడిగాను శ్యామల అక్కని. "అక్కా! ఆ అక్కావాళ్ళు మాట్లాడేది తెలుగు కాదు కదా అని!?" .. అక్క "అది తమిళం" అన్నది. "ఓహొ!" అన్నాను. ఆ తరువాత వాళ్ళు నావైపే చూసుకుంటూ మాట్లాడుకోవడం నేను గమనించాను, కాని అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని ఫొటోస్ తీసారు. ఆ విజయక్కచెల్లెలు "వాటీజ్ యువర్ నేం ?" అని అడిగింది. నా పేరు చెప్పాను. మీ పేరేంటి అని నేను అడగనూ లేదు ఆమె చెప్పనూ లేదు. అంతే!... నేను తిరిగి ఇంటికొచ్చేసాను
*****************************
ఆ రోజు సొమవారం. సాయంత్రం 7.30కి నేను కాలేజ్ నుండి ఇంటికి వస్తున్నా. అప్పుడు ఎవరో నా వెనుకే వస్తున్నారు అనిపించింది. కానీ వెనక్కు తిరగాలంటే ఎందుకో భయం వేసింది. ఎవరో ఒక అమ్మాయి వెన్...వెన్.... అని పిలుస్తుంది. అయినా అక్కడ కొంచం చీకటిగా వుండటం తో నేను పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెల్లిపోయి గేటు వెసుకున్నా. కాని ఎవరో చూడాలిసింది ?, అసలు నన్నేనా? నాకోసం అయితే ఇంటికి కూడా వచ్చేది కదా! ఇలా ఆలోచిస్తూ పడుకున్నా... ఆ తరువాత రోజు కూడా అలాగే అవడం తో వెనక్కి తిరిగి చూసా అరె! ఈమె మొన్న మేము కలిసిన అక్క!? . 'అక్కా మీరు'... 'ఆమ్మా నెనెదా'.... ఇంకా ఏదో అంటుంది తమిళ్, ఇంగ్లీష్ మిక్ష్ చేసి. నాకు ఒక్క ముక్క అర్దం అయితే ఒట్టు కాని వింటున్నా 'విజయక్క కోసం వచ్చారా?' అని అడిగాను కాలేజి పక్కనే కదా అలా వచ్చి నన్ను చూసి పిలిచి వుంటుంది అన్న ఉద్దేసంతో. కాని ఆమె అవును,కాదు అని రెండురకాలుగా తలవూపేసరికి నాకు ఏమి అర్దం కాక వచ్చేసాను ఆమె వెళ్ళి పోయింది అరె! నేను ఈమె పేరు అడగడం మర్చిపోయానే అని నవ్వుకుంటూ ఇంటికొచ్చేసా
**************************
మళ్ళీ రెండు రోజుల తరువాత ఇంటికొస్తుంటే ఆ ఆక్కే!? ఈ సారి ఎదురుగా వచ్చింది చూసి (అలా ఎదురుగా వచ్చినందుకు) నవ్వుకున్నానో నవ్వానో అర్దం కాకుండా చిన్న నవ్వు విసిరి 'హాయ్ !అక్కా' అన్నాను 'హలో హవ్ ఆర్ యు ?' అంది 'ఫైన్' అన్నను స్టైల్ గా ఆ దెబ్బకి (నా స్టయ్ల్ చూసి నాకు ఇంగిలీసు బాగా వచ్చనుకొని)ఆమె అనర్గళ ఆంగ్లధారలో మాట్లాడటం మొదలు పెట్టింది ఆమె మాట్లడేది అర్దం అయినట్టే ఉంది కాని ఆ ధారాలానికి దిమ్మ తిరిగి బిక్కమొఖం వేసి "అక్కా ఐ కాంట్ అండర్ స్టాండ్ యువర్ స్పీడ్ ఇంగ్లీష్ " అన్నాను నాకొచ్చిన ఇంగిలిపీసులో.. అది విని "ఓహ్ రియల్లీ సారి బట్ ఐ డోంట్ నో తెలుగు, బట్ ఐ కెన్ అండర్ స్టాండ్ ఇట్ ఒకే టుమారో ఐ గో టు మై హోం టవ్న్ మధురై" అంది. "ఓహ్! ఓకె బై "అన్నాను తరువాత ఆమె ఏదో చెప్పాలనుకుంది నేనేదో అడగాలనుకున్నాను కాని ఇద్దరం మాట్లాడలేకపోయాం.
అయినా నాకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదేమో కాని అర్దం చేసుకోగలను కదా !కాని ఈమె మాట్లాడతుంటే ఎందుకు అర్దం కావటంలేదో? ఆ....... అది తమిలింగ్లీష్ అయ్యివుంటుందిలే.. లేకపొతే నాకు అర్దం కాకుండా ఎందుకుంటుంది ? అనుకొని ఇంటికి వచ్చేసా.
'అరే! నేను ఈమెను కలిసినప్పుడల్లా పేరు అడగడం మర్చిపోతున్నాను ఎందుకు ?'.
నేను ఆ రోజే నిశ్చయించుకున్నాను ఎట్లయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలని (కానీ ఆచరనలో పెట్టలేదనుకో)
******************************
Inthakee mee perenti???...
రిప్లయితొలగించండి