3.నీకోసం.

తరువాత చాలా రోజులు ఆ అక్కని నేను కాలేజీ నుండి వచ్చేటప్పుడు అదే నెట్ సెంటర్ దగ్గర చూసేదాన్ని. చూసి కళ్ళతోనో,నవ్వుతోనో,చేయివూపో పలకరించేదాన్ని.
నేను ఎప్పుడు చుసినా తను అక్కడే వుండేది అప్పుడప్పుడు ఒక స్కూటి వేసుకొచ్చి మా కాలేజినుంచి నేను వచ్చేటప్పుడు ఆటో వెనుకే వచ్చేది. అసలు ఈమె వాళ్ళ వూరు మధురై అన్నది కదా ఇక్కడ ఎక్కడ వుంటుంది? (అదే ఎవరింట్లోనయినానా? లేక కాలేజి హాస్టల్లోనా? ఆ కాలేజిలో అక్కడ చదివే వారినే వుండనిస్తారు కదా! మరి ఈమె ఎక్కడుంటుంది?)? ఎందుకిలా నన్నే ఫాలో అవుతుంది ? ఇంతవరకూ అబ్బాయిలు అమ్మాయిల వెంట పడటం చూసాను, సైట్ కొట్టడం చూసాను కానీ ఈమె ఏంటి నన్ను ఇలా.......?

ఇలా అయితే ఇంక లాభం లేదనుకొని ఒక రోజు దైర్యం చేసి అడిగాను 'అక్కా మీరు ఎక్కడుంటారూ?' అని 'మా పెద్దమ్మగారి ఇంట్లో' అంది. అది ఎక్కడ ? అని అనడిగాను
".........." తను చెప్పిన వీధి మాకాలేజి దాటి చాలా దూరం వెళ్ళాలి.
ఈమె ఇంత దూరం ఎందుకొస్తుందో అర్దం కాలేదు, నెట్ కోసమయితే అక్కడకూడా వుంటాయే అనుకొని అదే అడిగాను ఆమెని
" అక్కా అక్కడ నెట్ సెంటర్స్ ఏమి లేవా" అని. తను పెద్దగా నవ్వి "వుంటాయి కాని...!"

"ఊ కాని..!? ఏమయిందక్క"

మళ్ళీ నవ్వి "నీ కోసం" అంది.
"నాకోసమెందుకు" అన్నాను.
తను ఏమి మాట్లాడలేదు.... అంతే నేను ఇంక తనతో ఎప్పుడూ మాట్లాడకూడదనుకున్నా....
నాకేదో అనుమానంగా వుంది ఆమె ప్రవర్తన అందుకే.

*********************************

కానీ ఓ రెండు రోజుల తరువాత


అ రోజు డిసెంబర్ 10 నా పుట్టినరోజు నేను నా ఫ్రెండ్స్ మంజు,స్వప్న,దేవి,రుక్మిణి అంతా కాలేజ్ డుమ్మా కొట్టాము. అందరూ మా ఇంటికి వచ్చారు. ఇంక ఆ రోజు మా ఇళ్ళంతా ఒక కిష్కిందారణ్యమే . అంతాకలిసి ఫొటోలు,డాన్సులు,అంత్యాక్షరి, చివరిగా సాయంత్రం కేక్ కటింగ్. అంతా అయిపోయాక అందరూ ఇళ్ళకి వెళ్ళటానికి బయలు దేరారు. కానీ మా స్వప్నాకి రోడ్డుదాటాలంటే భయం. దాన్ని రోడ్డుదాటించి ఆటో ఎక్కించడానికి నేనే వెల్లవలసి వచ్చింది. తనని ఆటో ఎక్కించి నేను మళ్ళీ రోడ్డుకిటువైపు వచ్చేసరికి,! తమిళక్క ఎదురుగా వచ్చింది.

'వాట్ ఈజ్ స్పెషల్ టుడే యు లుక్కింగ్ వెరీ స్మాట్ ?' అన్నది.
'ఇట్స్ మై బర్త్ డే ' అన్నాను (కొంచెం సీరియస్ గానే ).
'రియల్లీ మరి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు.' అన్నది.
'మీకెందుకు చెప్పాలి? అయినా ఎలా చెప్పాలి 'అన్నాను.
'ఎందుకేమిటి నీకు గిఫ్ట్ కొనే దాన్నికదా' అన్నది.
'నాకు అలా తీసుకోవడం ఇష్టముండదు ' అన్నాను.
'ఓహ్ సరే అయితే ఇలా రా" అన్నది.
'ఎక్కడికి?'
"ఇక్కడకే.రా" అని పక్కనే వున్న ఓ షాపులోకి తీసుకెల్లింది.

అది సెల్ ఫొన్స్, సిడీస్, కూల్ డ్రింక్స్,అమ్మే షాప్ కొత్తగా పెట్టారు చాలా చిన్నది. అందులోకి తీసుకెళ్ళి షాప్ ఓనర్ ని చూపించి 'ఈయన రాధా అంకుల్ ఈయనదే ఈ షాప్ ' అన్నది.
"ఓహో" అన్నాను.
'అంకుల్ ఈరోజు ఈమె బర్త్ డే ఒక డైరీమిల్క్, రెండు కూల్ డ్రింక్స్ ఇవ్వండీ అంది. ఆయన 'సరే కుర్చోండి' అని కుర్చీలు చూపించాడు. నేను కూల్ డ్రింక్స్ తాగను జలుబు చేస్తుంది అన్నాను. 'వాట్' అన్నది. ముక్కు,గొంతు పట్టుకొని 'జ లు బు' అన్నాను.
'ఓ యు మీన్ కోల్డ్?' అన్నది.
'అదే అనుకుంటా' అన్నాను (నాకంతవరకు జలుబుని ఇంగ్లీష్ లో ఏమంటారో తెలియదు మరి). 'ఓకే టేక్ దిస్ చాక్లెట్' అన్నది. (నాకు ఆ డైరీ మిల్క్ అంటేనే పరమ చిరాకు అయినా ఆమె ఫీల్ అవుతుందేమో అని తిసుకున్నా). ఆ అంకుల్ ఈమెతో చాలా చనువుగా మాట్లాడటం చూసి
అక్కని "అక్కా ఈ అంకుల్ మీ రిలేటివా?' అని అడిగాను.
'కాదు ' అన్నది.
'అయితే తెలిసిన వాళ్ళా?' అన్నాను.
'కాదు పక్కన నెట్ కి వస్తూ వుంటానుకదా అలాగే ఇక్కద సెల్ రిచార్జ్ కో, కూల్ డ్రింక్స్ కో,వస్తాను అలా పరిచయంచేసుకున్నాను. నీకోసం తప్పదు కదా' అన్నది.
'ఏంటక్కా ఎప్పుడూ ఏది అడిగినా నాకోసం అంటావు అడిగితే ఎమీ చెప్పవు ఏంటి విషయం" అన్నాను కొంచం కోపంగానే.
"అన్నీ చెపుతాను కాని.. ఇప్పుడుకాదు ఈ రోజు నీ బర్త్ డే కదా నీను రెండు రోజుల్లో మధురై వెళ్తున్నాను వెళ్ళిరాగానే చెపుతాను " అన్నది.
సరే బర్త్ డే రోజు ఎందుకులే ఈమె తో గొడవ అని, అక్కా నా బర్త్ డే కి నేనే మీకు చాక్లెట్ ఇవ్వాలి కాబట్టి ఇది మీరే తీసుకోండి అని చాక్లెట్ ఇచ్చి(ఇలాగయినా దాన్ని వదిలించుకోవచ్చని) లేచి వస్తూ..., అక్కా ఇంతకీ మీపేరేమిటి ?" అని అడిగాను తను "వాట్" అంది నేను "వాటీజ్ యువర్ నేం ?" అన్నను తను పెద్దగా నవ్వి " ఇంతవరకు నా నేం తెలియదానీకు" అన్నది.
"ఊహు" అన్నాను.
తను "సుధ" అన్నది.
"సుధా నా ! ఓకే" అని ఇంటికి వచ్చేసాను.

పేరు. మనిషి, మాట అంతా బాగున్నయి కాని... ఆమె తీరు,అన్నీ "నీ కోసమే" అనే పద్దతే నాకు నచ్చలేదు. ఇది ఎటువైపు దారి తీస్తుందో ఎమన్నా ప్రమాదమాదమెమో.... ఏమో ఏపుట్టలో ఏ పాముందో........!?. మళ్ళీ ఇలానే అంటే ఈసారి అమ్మావాళ్ళకి చెప్పాలి అనుకున్నాను. కానీ ఆమె నాకు నా ఫస్ట్ ఇంటర్ ఎగ్జాంస్ అయ్యేవరకూ మళ్ళీ కనిపించలేదు...
నేనూ ఇంక ఆమె గురించి మరిచి పోయాను...

*************************************

3 కామెంట్‌లు:

  1. ఇదేంటండి... ఏదో సస్పెన్స్ సీరియల్ అని చెప్పి ఇలా సస్పెన్స్ లో ముగిస్తే ?

    రిప్లయితొలగించండి
  2. బా రా రె గారు సస్పెన్స్ సీరియల్ అని నేను చెప్పనా చెప్పండి ?
    ఇకపొతే ఇది ఇంకా ముగియలేదు ఇప్పుడే మొదలయ్యింది. కానీ ఇప్పుటి పరిస్థితులను బట్టీ ఇప్పట్లో ముగిసేటట్లు కూడా లేదు, ఎందుకంటే మా వూరిలో అంతులేని(9గంటలు) విద్యుత్ అంతరాయమండీ బాబు.

    రిప్లయితొలగించండి
  3. అలాగే మీ వాఖ్య e-mail ("an you remove word verification? its annoying while commenting.
    On the serial story

    Narration is good, please look into typos.

    Bhaskara Rami Reddy.)"
    ద్వారా అందింది. పదనిర్ధారన కాదండీ ఆ పాత టెంప్లెట్ లో వున్న సాంకేతిక లోపాలవలన ఆ వాఖ్యలు కనిపించలేదు.

    రిప్లయితొలగించండి