4.పెద్ద అబ్బో.

ఎండాకాలం సెలవులు,అక్కపెళ్ళి,( మా పెద్దనాన్నగారి కూతురిది),రిసల్ట్స్ రావడం , అన్నీ ఫాస్ట్,ఫాస్ట్ గా అయిపోయాయి. మళ్ళీ కాలేజ్ కూడా స్టాట్ అయ్యింది. ఇప్పుడు మేమే సీనియర్సోచ్... ఈ ఆనందం ఎందుకంటే ..చెప్పనేలేదుకదూ మా కాలేజి లో ర్యాగింగ్ వుండేది అదీ ఎలాగంటే మ్యాథ్స్ గ్రూఫ్ సీనియర్స్ ,ఆర్ట్స్ జూనియర్స్ ని, ఆర్ట్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళని తెగ ఏడిపించేసేవారు వాళ్ళ కమెంట్స్ తో...
నేను మద్యలో చేరాను కదా నన్ను పెద్దగా ఏమీ అనలేదుగాని, ఒకడు(మ్యాథ్స్ గ్రూఫ్ లో సీనియర్) మాత్రం నన్ను "సౌందర్యా" అని పిలిచే వాడు (నేను సినిమా యాక్టర్ 'సౌందర్య'లాగా వుంటానని వాడి ఫీలింగు) అంతే ఇంకెవరూ ఏమీ అనలేదు (అంతేనని నేను అనుకున్నానంతే). కానీ వాడు మొదలెట్టిన ఆ కామెంట్ చివరకు అసలు నా పేరే అదేమో అనుకునేటంతగా మారిపోయింది మ క్లాస్ వాళ్ళు తప్ప మిగతా క్లాసెస్ వాళ్ళు, ఆకరికి మ్యాథ్స్,సైన్స్ లెక్చరర్స్ కూడా అంతా నన్నలాగే పిలిచేవారు. కానీ ఇప్పుడు మేమే సీనియర్స్ కదా ఇంక మమ్మల్ని ర్యాగింగ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అందుకనే ఈ ఆనందం.
కానీ ఇప్పుడు మా బోయ్స్ మ్యాత్స్, ఆర్ట్స్ వాళ్ళు డైరెక్ట్ గానే తిట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు కొట్టుకొనేవాళ్ళు కూడా.. అదివేరే విషయం.

*******************************

నాకు ఒకరోజు కాలుకి 'పెద్ద అబ్బో'(గాయం) అయ్యింది. మ అమ్మ ఎక్కడో చదివిందట అలాంటి గాయాలకి కొత్తిమీర, పుదీనా రసం కొంచం తాగి కొంచం ఆ గాయం మీదపెడితే తొందరగా తగ్గుతుందని. పొద్దున్నే నేను కాలేజికి బయలుదేరటప్పుడు నేను నాకొద్దు మొర్రో అంటున్నా వినకుండా ఆ ఆకు పసరు అలగే ఆ గాయం మీద పెట్టి పరవాలేదు కొంచెం సేపట్లో తగ్గిపొతుంది కాలేజి కి వెళ్ళు అని పంపించింది. మా నాన్న నన్ను బైక్ మీద కాలేజికి తీసుకెళ్ళి మా ప్రిన్సిపల్ తో 'మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదండీ కొంచం చూసుకోండి' అని చెప్పి నన్ను కాలేజిలో దింపి వెళ్ళారు.
ఆ గాయం నొప్పేమోగాని ఈ రసం మంట ఎక్కువయ్యింది. మాకు ఫస్ట్ కామర్స్ పిరియడ్. మా సార్ చెప్పే ఎకౌంట్స్ లో నాకు నవగ్రహలు వాటిఉపగ్రహలు,నక్షత్రాలు వాటి కక్ష్య లో నా కనుగుడ్లు గిరా.. గిరా తిరుగుతున్నట్టు అనిపించింది. అంతే ఆ దెబ్బకి పి.సుశీల వెస్ట్రన్ ఫోక్ పాడినట్టు,ఎస్.జానకి లలిత సంగీతం పాడినట్టు రాగాల ఏడుపు మొదలుపెట్టా. అది విని మా సారు దడుసుకొని తట్ట,బుట్ట (బ్యాగు, లంచ్ బాస్కెట్ ) చేతిలో పెట్టి ఇంటికెళ్ళి బబ్బోమని కాలేజి నుండి పంపించేసారు.
మా కాలేజి నుండి ఆటో ఎక్కే రోడ్డు కొంచం దూరం అందుకని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాను.
మా కాలేజి పక్కనే ఒక చిన్నషాపు వుంది. అక్కడ కాలేజి డుమ్మాకొట్టినోళ్ళు,కాలేజి అయిపోయినా కాలక్షేపానికి వచ్చే సీనియర్లు, ఇంకా అమ్మాయిలకు లైన్ వేసేటందుకు వచ్చే అబ్బాయిలు... అక్కడ కుర్చొని పిచ్చా పాటి కబుర్లు చెప్ప్పుకుంటూ వుంటారు.నేను ఆ టైం లో కాలేజి నుండి బయటకి వచ్చే సరికి అక్కడున్నవాళ్ళలో మా సీనియరు ఒకడు నన్నుచూసి సైకిలు చిన్నగా తొక్కుతూ "ఏం సౌందర్య ఏమయ్యింది ? ఏడ్చుకుంటూ వస్తున్నావ్ ? ఎవరయినా ఎమన్నా అన్నారా ? లేక ఫీజు కట్టలేదని వెళ్ళిపొమన్నారా ? ఎమయ్యిందీ ?" అన్నాడు.
"లేదన్నయ్యా ఒంట్లో బాగోలేదు అందుకే ఇంటికెళ్తున్నా" అన్నాను.
వాడు వెంటనే "ఏంటి అన్నయ్యా.. నా ?" అన్నాడు.
'ఊ' అన్నాను.
అతను "ఛీ నా బతుకు" అనుకుంటూ (అతను అలా ఎందుకన్నాడో నాకు అర్దమవ్వలేదు)వెళ్ళి పోబోతున్నాడు, నేను ఒక్క క్షణం అలాగే ఆగిపొయ్యి అతనివైపే చూస్తున్నా... ఇంతలో ఎటూవైపునుంచో మెరుపులా వచ్చి, ఉరుముల్లా గట్టిగా "who is he?, why are you crying ?, ఏమన్నాడు నిన్ను ? tell me ? చెప్పు !" అంటూ అరుస్తుంది తను. ఆమె మళ్ళీ కనిపించినందుకు ఆశ్చ్యర్యం తో నేను, ఏమి జరుగుతుందో తెలియక బిక్క మొఖం వేసి ఆ అబ్బాయి ఇద్దరం ఆమెవైపే చూస్తున్నాం.
***
నేనే ఆమెను ఆపి 'ఏమీ లేదక్క తను మా సీనియరన్నయ్య, తను నన్నేమి అనలేదు నేనే హెల్త్ బాగోలేక ఇంటికివెల్తున్నాను' అన్నాను.
'oh! sorry' అని ఆ అబ్బాయికి చెప్పి, నాతో 'ఇంటికా ? అయితే ఎక్కు' అంది బ్యాక్ సీట్ చూపిస్తూ.
నీ స్కూటీ పైనా..? అన్నాను. సంశయిస్తూ
'నాకు డ్రైవింగ్ బాగనే వచ్చు కూర్చో' అంది. ఇప్పుడు ఎలాగూ ఆ ఆటో దాకా నడవలేనుకదా అని తప్పక కుర్చున్నాను.
తను చాలా నెమ్మదిగానె డ్రైవ్ చేస్తూ.. 'అయితే ఉదయం కూడా అందుకే ఏడ్చావా ?' అని అడిగింది.

'ఉదయమా ? ఎప్పుడు ?' అని అడిగాను.

'మీ డాడీ బైక్ మీద వెళ్ళేటప్పుడు'.

'అప్పుడా నువ్వెక్కడ చూసావ్?'

"నేను నైటే ఊరినుండి వచ్చాను. ఉదయాన్నే నిన్ను చూడాలని మీ ఇంటివైపు వచ్చాను. మీ గేటు దగ్గర నువ్వు ఏడుస్తూ బైక్ ఎక్కుతున్నవ్.మీ మదర్ అనుకుంటా!? శారితో నీ మొఖం తుడుస్తూ 'ఏమీ కాదులే తగ్గిపోతుంది' అంటున్నారు. అప్పుడు చూసాను. నీ వెనుకే వచ్చాను. నా కెందుకో ఇంటికివెళ్ళినా నువ్వు మరీ మరీ గుర్తొచ్చి స్నానం చేసి వెంటనే ఇటువైపు వచ్చేసాను ఇంతలో నువ్వే కనపడ్డావు ఆ అబ్బాయితో.." అంది.
మళ్ళీ తను 'నిన్ను చూడాలని ' అనడం నాకు చిర్రెత్తింది. అయినా ఆ క్షణం ఆ నొప్పి బాధలో అది బయట పెట్టే స్తితిలో నేను లేను ఇంతలో ఇల్లొచ్చేసింది దిగి 'thanks' చెప్పి ',ఫార్మాలిటికి 'ఇంట్లోకి రా అక్కా ' అన్నాను. కొంచం సంశయిస్తూనే..
తను సరే అంటూ లోపలికి వచ్చింది. మా ఇంటికి తాళం వేసి వుండటం చూసి 'అయ్యో ! ఇంట్లో ఎవరూ లేరా !?' అంది.
'తాళంచెవి పక్కింట్లో ఉంటుంది' అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి, తలుపు తీసి "లోపలికి రండక్కా " అని పిలిచాను.
తను లోపలికి వచ్చింది నేను తనని కుర్చిలో కుర్చోమని నేను వెళ్ళి తాగడనికి మంచినీళ్ళు ఇచ్చి 'ఒక్క నిముషం అక్కా' అని తొందరగా ఆ ఆకు పసరు కడుక్కొని వచ్చి తెచ్చి పక్కనే వున్న బల్ల(దివాన్ కాట్) మీద కుర్చున్నాను.
తను 'పడుకుంటావా ? ఇప్పుడు ఎలా ఉంది?' అని అడిగింది.
'కొంచం పర్వాలేదు అన్నాను.
"అమ్మ ఎక్కడికి వెళ్ళారు?" అనడిగింది
"అమ్మ టీచర్ స్కూల్ కి వెళ్తారు,డాడి ఆఫిస్ కి, నేను కాలేజి కి వెళ్తాము అందుకే ఇంట్లో ఎవరూ వుండరు" అన్నాను.
తను మీ మదర్ టీచరా? oh good. witch subject ? అనడిగింది.
"తెలుగు" అన్నాను.
'అమ్మో తెలుగా!? అయితే మీ మదర్ని నేనసలే కలవకూడదన్నమాట' అంది. నాకు నవ్వాగలేదు.
'అవును అదీ నిజమే నీ తెలుగు ఆమె వినక పోవడమే మంచిది' అన్నాను. (అలా అనడమే నేను చేసిన తప్పని నాకు తరవాత చాలా కలానికి తెలిసొచ్చింది).
" అక్కా ఇంతకీ మీ అమ్మా, నాన్నా ఎక్కడుంటారు ? ఏమి చేస్తుంటారు ?" అని అడిగాను.
తను వెంటనే తల దించుకొని ఒక్క నిముషం ఆగి తనగురించి చెప్పింది.

7 కామెంట్‌లు:

  1. అంత పెద్ద "అబ్బో" అయిందా? అదేనేనైతేనా తొందరగా మానాలని ఎర్రకారం,వుప్పు కలిపి రాసుండేవాడిని. అవును సౌదర్యా, ఆ తొట్టిగ్యాంగ్ లో నేనూ వున్నాను గమనించావా?

    సరేకానీ, ఈ అక్క ఎవరో కానీ మాకు కిక్కు ఎక్కిస్తుంది. గుడ్ నారేషన్ అండ్ లైట్ హ్యూమర్.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా రాసావ్ సౌందర్య....మరి ఏమని పిలవాలో తెలియడం లేదు...నీ పేరు చెప్పలేదు కదా?..లేక వేరే ఏదైనా పోస్ట్ లో నీ పేరు చెప్పవేమో తెలియదు ఎందుకంటే నీ బ్లాగ్ ఇప్పుడే చూడటం...చక్కని హాస్యంతో బాగుంది..

    రిప్లయితొలగించండి
  3. "లేదన్నయ్యా ఒంట్లో బాగోలేదు అందుకే ఇంటికెళ్తున్నా" అన్నాను.
    వాడు వెంటనే "ఏంటి అన్నయ్యా.. నా ?" అన్నాడు.
    'ఊ' అన్నాను.
    అతను "ఛీ నా బతుకు" అనుకుంటూ (అతను అలా ఎందుకన్నాడో నాకు అర్దమవ్వలేదు)
    నిజంగా అర్దమవ్వలేదా? సౌందర్యా నువ్వు అ'మాయ'కురాలివా,లేక,గడుసుదానివా

    రిప్లయితొలగించండి
  4. "ఉపగ్రహలు,నక్షత్రాలు వాటి కక్ష్య లో నా కనుగుడ్లు గిరా.. గిరా తిరుగుతున్నట్టు అనిపించింది."
    talucukuntene navvaagadam ledandi. chaala baagundi taruvata emayyindo cepparuu

    రిప్లయితొలగించండి
  5. భా.రా.రే గారు మీరు అంతటి అసాధ్యులే.. మీకు అల్రెడీ చెప్పానుగా మీరు గిల్లి జోల పాడుతుంటారని.... ఈ కిక్కును రోజుకు కొంచం ఎక్కిస్తానండీ ఎందుకంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ చెయ్యడం నా వల్లకాదండి.

    కిషన్ గారు థ్యాంక్స్ అండీ.
    మొత్తానికి పేరు కనిపెట్టేసారన్నమాట. అంత కష్ట పడే బదులు నా ఇంకో బ్లాగులో 'నా గురించీ చూడాలిసిందండీ.

    సుజ్జి గారు దన్యవాదాలండి.

    అజ్ఞాత గారు (మీరు పేరు చెప్పలేదుగా మరి) నేను నిజంగా అమాయకురాలినే అండి.,నాకు ఏ మాయలు రావు,గడుసుతనం అసలే లేదు.

    smily గారు అంతే లేండి ఒకరి బాధ ఒకరికి సంతోషం కదండీ. సరేలే...

    తప్పకుండా చెపుతాను మీరు కొంచం ఓపిక వహించండీ

    రిప్లయితొలగించండి