అని తను చెప్పడం మొదలెట్టింది.
ఆరోజు....
"నువ్వు అలా హాస్టల్ రూంలోకి వస్తూ వుండటం చూసి ఆశ్చర్యపోయాను!
నువ్వు, నీ నవ్వు, నీచూపు,నీ నడక,నీ మాట అచ్చం మా అమ్మ లాగానే వున్నావు." అంది.
" నేనా మీ అమ్మ లాగా వున్నానా ... !?" ....
" ఆ అవును !...
అప్పటినుండీ.. నీతో మాట్లాడాలని, చాలా ట్రై,చేసా కానీ నువ్వు ,నీకు తెలుగు తప్ప ఏమీ రాదన్నావు. మరి ఎలా? ఎలా?.... అని చాలా ఆలోచించా.
పోనీ 'విజయ' తో చెప్పి మాట్లాడిద్దామా అనుకున్నాను. కానీ ఎలా చెప్పాలి ? తనకూ అంతగా ఇంగ్లీష్ రాదు. అయినా అసలు నా ఫీలింగ్స్ ఇవి అని కచ్చితంగా నాకే తెలియని పరిస్తితి అది.
కానీ...కానీ.. నిన్ను చూడకుండా అసలు వుండలేకపొయేదాన్ని,అలా చూస్తుంటే మా అమ్మే అక్కడ వుందేమో అని అనిపించేది.
కానీ నువ్వేమో, అసలు నాతో ఏమి మాట్లాడలేక పొయేదానివి. అయినా నువ్వు చిన్నపిల్లవు చెబితే ఏవిధంగా అర్దం చేసుకుంటావో తెలీయదు. అదీ కాకుండా నువ్వు నన్నుచూస్తేనే భయపడే దానివి.నీ తప్పులేదు కొత్తవారితో మాట్లాడాలంటే ఎవ్వరికయినా కొంచం అదోరకమయిన అనుమానం, అవీ వస్తుండటం సహజమే ఏమి చేయాలి మరి ఆలోచించాను.....
చివరికి 'తెలుగు ' నేర్చుకుంటే ఏమయినా పరిస్కారం దొరుకుతుందేమో అనిపించి, వూరికెళ్ళి తమిళ్-తెలుగు బుక్స్ తెచ్చుకొని, తెలుగు తెలిసినవారి దగ్గర ట్యూషన్ చెప్పించుకొని.... ఎలాగయితే కష్టపడి 'తెలుగు ' నేర్చుకున్నా.
కానీ ఎంత కష్టపడ్డా ఏదీ నేర్చుకోవడం అంత ఈజీ కాదు అని మొదటిసారిగా తెలిసొచ్చింది. అదీ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది ఇంకా కష్టం అని కూడా...
కానీ..., నీతో ఎలాగయినా మాట్లాడాలనే తపన,కోరిక,ఇష్టం..... ఇవన్నీ కలిపి ఇంత తక్కువ సమయంలో నన్ను తెలుగు నేర్చుకొనేలాగా చేసాయి ...
పెద్దమ్మకు కూడా అప్పుడే చెప్పాను "మేము ఇక్కడ వుండలేము, తమ్ముడుకూడా చదువుకుంటున్నాడు వాడికీ కష్టమవుతుంది, డాడీ బిజినెస్ డీల్స్ కూడా చాలా వున్నాయి అవీ చూడాలి... కాబట్టి మేము ఇక్కడ వుండటం కష్టం. కానీ ప్రతీ నెలా నేను వచ్చి పోతుంటాను.. నువ్వేమీ బెంగ పెట్టుకోకు. అమ్మా వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు, మన మధ్యే వున్నారు, మన జ్ఞాపకాలలో ఎప్పటికీ వుంటారు. అక్కడినుండి వారిని తీసుకెల్లడం ఆ పెరుమాళ్ళ వల్లకూడా కాదు" అన్నాను.
అలా.. ఆమెకోసం కాకపోయినా నీకోసమయినా, కచ్చితంగా రావలని డిసైడ్ చేసుకున్నా . ఎందుకంటే నాకు ఎందుకో మా అమ్మే నా మీద ప్రేమతో నీలా వచ్చిందని నా గట్టి నమ్మకం.
"ఇందాక నువ్వు 'రిమా అక్కా ' అన్నావు చూడు...! అచ్చం మా అమ్మ కూడా నన్ను అలాగే 'రిమా తల్లీ' అనేది.. అందుకే అప్పుడే నాకు నీ మీద ఇంకా......... చెప్పలేనంతగా........... ఇష్టం వచ్చేసింది. సో నువ్వు కచ్చితంగా మా అమ్మవే !......" అంది.
అలా తను చెబుతున్నప్పుడు తన మొఖం చూడాలి..... అది ఆనందమో,సంతోషమో,అమ్మయ్య తనకు చెప్పేశాను అన్న తృప్తో.... ఇంకా ఎదో.... కాదు... ఎన్నో భావాలు కనపడుతున్నవి. ఇంక తన కళ్ళయితే యమలీల సినిమాలో ఇంద్రజను చూసినప్పుడు ఆలి కళ్ళలోలాగా.... దీపావళి కాకరపువ్వొత్తుల్లా వెలుగుతున్నాయి. .*.*.*.*.*.
నేను తననలా చూస్తుంటే....
తను "ఇప్పుడు అర్దం అయ్యాయా ? నా ఫీలింగ్స్,నా నిర్ణయం,దారి ఎంటో..?" అని అడిగింది.
నేను ఒక్కసారే ఏమి చెప్పాలో తెలియక. తలను అడ్డంగా నిలువుగా,గుండ్రంగా... తిప్పాను.
తను ఓ నవ్వు నవ్వి,
"నాకు నిన్ను చూడగానే మా అమ్మవనే "ఫీలింగ్",
నీతో మాట్లాడడానికి తెలుగు నేర్చుకొనితీరాలనే "నిర్ణయం",
పెద్దమ్మతో పాటు నిన్నుచూడడానికి ఇక్కడకి ప్రతి నెలా రావొచ్చనే "దారి"..."అంది.
నేను 'ఓహ్!' అన్నాను.(మనసులో దీనిలో ఇంత అర్దం వుందా అనుకొని.)
ఆ తరువాత తనని కలవడానికి గానీ మాట్లాడటనికి గానీ నేనెప్పుడూ సంకోచించలేదు.
ముందే అనవసరంగా నేను తనని చాలా అపార్దం చేసుకున్నానే అని చాలా బాధపడ్డాను.
ఇంతలో కొన్ని రోజుల తరువాత ......
:) hammayya.. mottaniki vishyam chepparu.
రిప్లయితొలగించండిబాగుంది, మీలాగే ముదట్లో మేమూ అనుమానించాము. మీరు వ్రాసేది మేము వింటుంటాము, చదవము... కారణం చదివేటప్పుడు మీస్వగతం కాబట్టి మీరు చదివినట్టే చదువుతూ ఊ కొడుతుంటాము.
రిప్లయితొలగించండి"ఇంతలో కొన్ని రోజుల తరువాత ...... " హ్మ్ అదుగో మళ్ళీ ఎన్నిరోజులు ఆగాలి?
enka enni rojulu agali...
రిప్లయితొలగించండిఓ అదా సంగతి పాపం అనవసరంగా అనుమానిచాం కదండీ.
రిప్లయితొలగించండిturning la meeda turning lu tirugutundi ga me sneha sudhaamrutham...malli RGV suspense oettav ga vennela...hmmm em chestam wait cheyyalsinde...
రిప్లయితొలగించండిబలే బాగా రాసేరే కధ అంతా. బాగుంది. ఇది కధా నిజమా? బాగుంది ఏదైనా.. చెప్పే తీరు బాగుంది.
రిప్లయితొలగించండిఇంతలో కొన్ని రోజుల తరువాత ......
రిప్లయితొలగించండికొన్ని రోజుల తరువాత ...... emayyindi...??ayyabaaboi naa BP 180/220
అమ్మా వెన్నెలా! నీకిదేమయినా బావ్యమా ? నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి , అవాంతరాలు వస్తున్నాయి అని చెప్పావు. కాని కొంచం మా గురించి కూడా ఆలోచించమ్మా చూసావా ! ఎంతమంది ఎదురు చూస్తున్నరో నీ తరువత పోస్ట్ కోసం. వేనురం గారికి ఏకంగా BP 180/220 అంట, నేనసలే హార్ట్ పేషంట్ని....
రిప్లయితొలగించండిసుజ్జి గారూ మరి చెప్పక తప్పదు కదండీ,
రిప్లయితొలగించండిలేకపొతే ఆ భా రా రె గారు వాళ్ళ సంఘం తరుపున నాకు ఇచ్చిన 'సస్పెన్స్ సౌందర్య' అన్న బిరుదు కాస్తా 'నాంచుడు సౌందర్యా' అని మార్చేసేయగలరు..
అబ్బా !భా రా రె గారు, అజ్ఞాత గారూ ఇంకొన్ని రోజులు ఆగొచ్చులెద్దూ.
smily గారు మీరూ అనుమానించారా...? నేనే అనుకున్నా ! అయితే అందరూ నాలాగే ఆలోచిస్తారన్నమాట :-(హ్హ హ్హ హ్హ)
రిప్లయితొలగించండిKishen గారు టర్నింగులన్నీ ఒకేసారి వస్తే 'బండి ' నడపటం కష్టం కదండీ... అందుకే ఆగి ఆగి చెబుతున్నా.
భావన గారు కథలన్నీ జీవిత గాధలే కదండీ... ఎట్టకేలకు మీరూ నా బ్లాగ్ చూసారు అందుకు కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండివేనూరాం గారూ అన్నిటికీ అంత తొందరయితే ఎలాగండీ.
అయ్యో సత్యనారాయణ గారూ !... అలాగా ! అయితే తప్పకుండా రేపే కొత్త పోస్ట్ వేసేస్తాను. అందరి ఆరోగ్యం కోసం (మీ ఆరోగ్యమే నాకూ..నా బ్లాగుకి కొండత బలం కదా మరి ).
రిప్లయితొలగించండి