10.ఊహల్లో..... సెల్లులో.... సొల్లు.

నా ఇంటర్ రిసల్ట్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను . అంతా బాగుంది కాని తరువాత ఏమి చెయ్యాలి ?

CA కాని ICWA కాని చేస్తానన్నాను నేను,
మావాళ్ళందరూ,"అవి చాలా కష్టం.అయినా ఆ కోర్స్ లు మన ఊరిలో లేవు నువ్వు విజయవాడో,విశాకపట్ణమో,హైదరాబాదో.. వెళ్ళి చదవాలి, నువ్వేమో ఒఠ్ఠి అమయుకురాలివి, అదీకాక రెండు,మూడు రోజులకొకసారి కడుపునొప్పి,కాలునొప్పి అని కాలేజ్ మానేస్తుంటావ్. అలా అయితే ఇలాంటి కోర్స్ చేయలేవు.అందులోనూ అలాంటి కోర్సులు చదవాలంటే బాగా కష్టపడాలి" అన్నారు. ఇలా చాలా రోజులు చర్చ జరిగాక... 'సరే' అని నేనూ కాస్త బారిష్టర్ పార్వతీశం లెవల్లో మంచి చెడులు ఆలోచించి,' డిగ్రీ చేసాక అయినాసరే ఈ CAలో చేరితే అక్కడ బేసిక్స్ లేకుండా డైరెక్ట్ గా CAఇంటెర్ టూ లో జాయన్ అయిపోవచ్చు' అనుకొని. డిగ్రీయే చేద్దామని డిసైడ్ అయ్యా.
అయితే మరి ఈ డిగ్రీ ఎక్కడ చేయాలి... ? అని మళ్ళీ చర్చ మొదలయ్యింది. మేము ఈ మీమాంసలో ఉండగానే మా కాలేజి వాళ్ళు ఫోన్ చేసి "నువ్వు డిగ్రీయే చదవాలనుకుంటే మేము T C ఇవ్వము, మన కాలేజ్ లోనే కొత్తగా డిగ్రీ కూడా స్టార్ట్ చేసాము కదా ! కాబట్టి నువ్వు ఇక్కడే చేరాలి" అన్నారు. ఇంక చేసేదేమీ లేక అక్కడే కామ్ గా బికామ్ లో చేరిపోయా..

తెలిసిన కాలేజ్,తెలిసిన లెక్చరర్స్,తెలిసిన ఫ్రెండ్స్, తెలిసిన దారి అంతా తెలిసినవే కానీ ఎందుకో నాకు అక్కడ ఏవీ అంతగా నచ్చలేదు అది ఎందుకో, ఏమో,నాలో ఏదో తెలియని అసంతృప్తి ఉండిపోయింది. (బహుశా అన్నీ తెలిసినవే కాబట్టేమో !?).
ఇదేమాట రిమక్క దగ్గర చాలా సార్లు అన్నాను. దానికి తను " ముందు నువ్వు ముక్కు మూసుకొని మూడు సంవత్సరాలు ఇది చదువు. ఆ తరువాత నిన్ను ఏ మేనేజ్మెంట్ కోర్స్ లోనో చేర్పించ్చి నేను చదివిస్తాను కదా ".అని అంది.అంతే నా ఊహలకు రెక్కలొచ్చి ఎక్కడెక్కడో తిరిగొచ్చాను.
రోజూ సాయంత్రం కాలేజి నుండి వచ్చేటప్పుడు తను ఎదురొచ్చేది. కాసేపు ఆ రాధా అంకుల్ షాప్ లోనో,పక్కనున్న నెట్ సెంటర్లోనో మా ముచ్చట్లు సాగేవి. తను ఊరిలో లేనప్పుడు సాయంత్రం ఆ సమయానికి తన వద్ద నుండీ ఫోన్ వచ్చేది.ఇలా మేము ఇద్దరం కొన్ని నెలల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సర్వసాదరణంగా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచను. ఎందుకంటే నాకు అందరిలోకల్లా మా అమ్మే పే....ద్ద బెస్ట్... ఫ్రెండ్. అందుకు. కానీ... సుధ అక్క విషయం మాత్రం తన దగ్గర చెప్పలేదు. ఎందుకూ అంటే పెద్ద కారణాలేమీ లేవు కానీ. మొదట్లో తను కంగారు పడుతుందని చెప్పలేదు,తరువాత తను అనుమాన పడుతుందని చెప్పలేదు,ఆ తరువాత తను అనవసరంగా భయపడుతుందేమో అని చెప్పలేదు , పోను పోను చెప్పే అవసరము......., సందర్బమూ.... రాక చెప్పలేదు.
ఒకరోజు సాయంత్రం ఇంటికొచ్చి అక్క దగ్గరనుండీ ఫోన్ రాలేదేంటా అని ఆలోచిస్తూ ఎదురుచూసుకుంటూ బయట కుర్చున్నా.నేను ఫోన్ చేస్తుంటే తన ఫోన్ కలవడం లేదు. ఏమయ్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నా ఇంతలో... మా ఇంటిఓనర్ గారి ఇంటికి వచ్చిన వారి బంధువులమ్మాయి బయట ఉయ్యాలలో ఉగుతూ సెల్ ఫొన్లో మాట్లదుతుంది. అది సెల్ ఫోన్స్ వచ్చిన కొత్త. మా నాన్నకు ఎప్పటి నుండో సెల్ వున్నా బయట పది చోట్ల తిరిగే వారు కాబట్టి వారికి దాని అవసరం చాలా వుంటుంది. సుధక్క చేతిలో చూసినా తనూ వందిళ్ళ పూజారమ్మ కాబట్టి తన దగ్గర ఉండటం తప్పనిసరి అనిపించేది. కానీ ఈ అమ్మాయి చేతిలో సెల్ చూస్తుంటే ఎందుకో ఆ ఫీలింగ్ రావడం లేదు. అదీ కాక ఆ అమ్మాయి అటూ ఇటూ మెలికలు తిరుగుతూ... తెలుగూ,ఇంగ్లిష్ మిక్ష్ చేసి వాటినీ మూతి అష్ట వంకర్లు తిప్పి స్టైల్ గా, మోడ్రన్ గా మాట్లాడుతూ... ఉంది నిరంతర వార్తా స్రవంతిలా...
ఆమె ఒక్క నిముషం గ్యాప్ ఇవ్వగానే నేను ఆమె దెగ్గరకు వెళ్ళి
"అక్కా మీ డాడీ ఏమి చేస్తుంటారు ?" అని అడిగాను.
దానికి తను మూతి,ముక్కు,కళ్ళు.. పైకెత్తి "బిజినెస్"అన్నది.
నేను "ఓహొ అలానా అయితే ఈ సెల్లు బిల్లు ఎవరు కడతారు". అన్నాను. "మా డాడ్" అన్నది. "అవునా ! ఇంతకీ నెలకు బిల్లు ఎంత వస్తుందక్కా " "జెస్ట్ 2000 - 2500 మద్యలో." నేను మనసులోనే కళ్ళు తేలేసి పైకి "ఓ అంతేనా." అన్నాను. "ఆ..! ఇంకా మా ఫ్రెండ్స్ కి అయితే ఇంకా ఎక్కువే వస్తుంది".అని ఏవరూ ఫోన్ చేయక పోయినా 'ఆ హలో' అంటూ అక్కడినుండీ వెళ్ళిపోయింది.
అసలే ఊరికే ఊహల్లో విహరించే నాకు ఎందుకో అప్పుడే అక్కడే ఆ అమ్మాయే నేనయినట్టూ అలా సెల్లులో స్టయ్ల్ గా సొల్లు కొడుతునట్టూ..కలలు కంటుండగా............ హఠాత్తుగా....

10 కామెంట్‌లు:

  1. జ్ఞాపకాలపందిరికి "సుధామధురిమ" అనే ఊయల కట్టి కార్తీకపున్నమి "వెన్నెల"లో ఓలలాడిస్తున్నావు కదమ్మా!

    రిప్లయితొలగించండి
  2. నిజం గానే సస్పెన్స్ సౌందర్య వే.. ;-)
    కొంచం బిగి పెట్టు కధ లో. చెప్పేది చిన్న పిల్ల కాబట్టి ఇంటర్ చదివే అమ్మాయి కాబట్టి పెద్ద మెచ్యూర్ గా రాయలేము ఎలా ఐనా, కాని సంఘటన ల అల్లిక లో ఇంకా కొంచమెక్కువ కనక్షన్ పెట్టు.. ఇప్పుడు కూడా బాగుంది ఇంక బిగి పెట్టీ మాటల వాడకం లో శ్రద్ధ వహించు యద్ధనపూడి తరువాత నువ్వే ... All the best

    రిప్లయితొలగించండి
  3. అంతలో హఠాత్తుగా ట్రింగ్..ట్రింగ్

    "ఏమేయ్ వెన్నలా నీకు ఫోనే ఎవరో రిమా అంటా" అన్న అమ్మకేక కు ఒక్క పరుగున ఇల్లు చేరి రిసీవర్ ఎత్తాను. అవతల అక్క. వెన్నెలా ఇలా లాభంలేదు కానీ నేనొచ్చాక నీకో మొబైల్ కొనిస్తాను అంది. ఆ మాటకు నేనెగిరిన ఎగురుకు టీపాయ్ పగిలిపోయింది.

    అంతేనా?

    రిప్లయితొలగించండి
  4. సుధ

    భలే థ్రిల్లింగ్.నాపేరు ని తెలుగు లో ఇలా అచ్చులో చూసుకున్నప్పుడల్లా.. ఒహ్!!! ఎంత అందమయిన పేరో .కదా..అనిపిస్తుంది.
    .నేను రెగ్యులర్ గా విజిట్ చేసే బ్లాగ్స్ లో ఇదొకటి. నా పేరు చూసుకోడానికి మాత్రమే కాదండోయ్ . మీ బ్లాగు కూడా చాలా బావుంది

    రిప్లయితొలగించండి
  5. Vennela....bagundi...bhaskar me kosamerupu adirindi...waiting for next part...

    రిప్లయితొలగించండి
  6. కాంతం గారు మీ అభిమానానికి దన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. అబ్బా.. ! భా రా రే గారు....
    సర్వ జ్ఞానులు, మీరు అంతలా చెప్పిన తరువాత అంతేకాకుండా ఇంకేమి వుంటుందిలేండి..

    రిప్లయితొలగించండి
  8. అన్వేసిత అదే సుధ గారు.. పేరే కాదు మా సుధక్క మనసూ మధురమే అండీ. ఇలాగే ఇంకొన్ని రోజులు ఫాలో అయితే ఆ సంగతి ముందు, ముందు మీకే తెలుస్తుందిలే...
    అయినా నాదొక చిన్న డౌటు ఆ పేరు పెట్టుకున్నవాల్లంతా ఇంతేనా నాకు తెలుగు తప్ప మరే భాష రాదంటే వినకుండా నా తెలివికే పరిక్షపెడతారెప్పుడూ...ఆమేమో.. తమిళ్, మీరేమో...కన్నడ... కానీయండి... కానీయండీ ...ఎప్పటికయినా నేనూ... భారత దేశంలో భాషలన్ని నేర్చుకొని.భాషకొక్క బ్లాగు చొప్పున ( అన్నిటి పేరులోనూ 'సుధ ' అని వుండేటట్టు చూసుకొని మరీ) పెట్టేస్తా !..????...!

    రిప్లయితొలగించండి