కొంచం సేపటికి....తను మళ్ళీ చెప్పడం ప్రారంభించిది..... ఇంత జరిగినా మా అమ్మమ్మా వాళ్ళు ఎవ్వరూ కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రాలేదు. కానీ ఇక్కడుండే మా పెద్దమ్మ వచ్చి మమ్మల్ని తనతో పాటు తీసుకెల్తానని చాలా బ్రతిమలాడింది.
ఈ ఊరు, ఈ ఇల్లు ఒదిలి రావడమా...?
ఇది మాడాడీ కట్టుకున్న ఇల్లు, తన కలలకు, ఆశలకు,ఆశయాలకు...నిలయమయిన ఇల్లు,మేము పుట్టి,పెరిగిన ఇల్లు , మా అమ్మా,నాన్నలతో ఎన్నో మధురమయిన అనుభవాలు,ఆనందాలు పంచుకున్న,అందమయిన జ్ఞాపకాల పొదరిల్లు.
అలాంటి దీన్ని ఒదిలి, రాష్ట్రం కాని రాష్ట్రంలో, బాష కూడా రాని ప్రదేశంలో, పరాయి ఇంట్లో, మేము ఎలా ఉండగలం ? ఎలా రాగలం ? మా ఇద్దరికీ అది ఇష్టం లేదు.
నెల రోజుల తరువాత..
పెద్దమ్మ కూతురు 'విజయ ' ఫొన్ చేసింది.
'అమ్మ చాలా అప్సెట్ అయ్యింది. చాలా బాధ పడుతుంది.
నిద్రలో 'చెల్లీ...అంతా నావల్లే ' ' నా హస్తవాసి అంత మంచిది కాదు అందుకే ఇలా..అంతా నావల్లే... ' అంటూ కలవరిస్తుంది.
నాకు ఎగ్జాంస్ జరుగుతున్నాయి. అందుకే అమ్మని అలా చూడలేక నాన్న బావని ఒప్పించి మా అక్కని తీసుకొచ్చి అమ్మ దగ్గర వుంచారు నేను హాస్టల్లో వుంటున్నాను, నువ్వు ఒక్కసారి వచ్చి వెళ్ళరాదు.." అంది.
నాకు అదివిని చాలా బాధేసింది.
రెండు రోజులాగి, తమ్ముణ్ణి స్కూల్ హాస్టల్లో చేరిపించి,
నేను పెద్దమ్మని చూడటానికి ఇక్కడకి వచ్చాను.
పెద్దమ్మ చాలా పీలగా అయ్యిపోయింది. నాకామెను చూసి ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె మళ్ళీ మమ్మల్ని ఇక్కడికి రమ్మని చాలా గొడవ చేసింది. నేను ఆమెకు నచ్చచెప్పి చూసాను. తను నా మాట వినేట్టులేదు. పెద్దమ్మ చాలా మొండిగా.. నా తప్పుకు ఇదే ప్రాయశ్చిత్తం ... అంటూ వాదిస్తుందే..! కానీ ఎలా నేనిక్కడ వుండడం... ?
'నేను విజయ దగ్గరకు వెళ్ళివస్తానని ' చెప్పి, విజయ హాస్టల్ కి వచ్చాను. అమ్మను ఎలాగయినా ఒప్పించమని విజయకూ చెప్పాను.
మేము ఇలా అనుకుంటుండంగానే ఆ రూంలోకి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అది నువ్వూ,మీ ఫ్రెండ్.
నాకు నిన్ను చూడగానే ఆశ్చర్యం వేసింది,!..? కాసేపు నీ వైపే అలా చూస్తూ ఉండిపోయాను.
ఇంతలో విజయ "ఏంటి ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నవ్ ?" అని అడిగింది.
నేను " ఏమీ లేదు, ఊ.. నువ్వు చెప్పు " అన్నాను.
అప్పుడే నీకు గుర్తుందో లేదో నీ పేరు అడిగాను.
నువ్వు చెప్పావ్ . (నేను 'ఆ అవును గుర్తుంది అంటూ' తల వూపాను ).
అప్పుడు కూడా... నాకు అదే ఫీలింగ్..
తరువాత కూడా నిన్ను చూడాలని, కలవాలని, నీతో మాట్లాడాలని చాలా ట్రై చేసాను.
కానీ నీకు నా భాష రాదు, నాకు నీ భాష రాదు ఎలా..?
వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను, పెద్దమ్మ సమస్యకూ అది దారి చూపింది, కాదు కాదు చూపెట్టెటట్లు నువ్వే చేసావు.
****************************
వెంటనే నేను
"ఆహా...! మళ్ళీ...... నువ్వు,నీ కోసం,నీ గురించి,నీ వలన,
అక్కా మళ్ళీ మొదటికివచ్చావా.... !?
నన్ను చూసి ఎందుకు ఆశ్చర్యం !? నేనేమన్నా విచిత్ర కోతిలా వున్నానా !?
ఏంటా ఫీలింగ్....!? గిలిగింతలు పెట్టుకొని నవ్వాలనా ?
ఏంటా నిర్ణయం...!? నా తోకలాంటి జడ పట్టుకొని ఆడాలనా ?
ఏంటా దారి...!? నా మెడలో తాడు ఒకటి కట్టి మీ పెద్దమ్మకి ఇచ్చి ఆటాడించమని చెప్పాలనా ?చెప్పు..? చెప్పక్కా ? చెబుతావా లేదా ? " అని అడిగాను.
అప్పటిదాకా సీరియస్ గా చెబుతున్న తను ఇది విని ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది.
ఆ నవ్వు తను మనస్పూర్తిగా(మనసారా) నవ్వుతున్నట్టనిపినిచింది. ఎందుకంటే అంత అందమయిన నవ్వు నేను ఇంతక ముందు ఎన్నడూ,ఎవ్వరూ నవ్వగా చూడలేదు.
స్వచ్ఛమయిన నవ్వంటే ఏంటో అప్పుడే నాకు మొదటిసారిగా తెలిసింది.
తను నవ్వాపి "అరె..! అదే చెపుతున్నా వినవమ్మా" అంటూ చెప్పడం ప్రారంభించింది...
*******************
Vintunnamu cheppu Mari
రిప్లయితొలగించండిahaa meeruu malli modhatiki vacchaaraa ? okka postlo edipinci,ventanea pakka postlo navvinceasaarandi. chaalaa baagundi.
రిప్లయితొలగించండిuuu.....taruvaata....?
malli suspense....hmm kanee kanee....
రిప్లయితొలగించండివెన్నెలా ఈ రోజే నీ బ్లాగ్ చూసానమ్మా. నువ్వు రాసే పద్దతిలో తెలుగుతనం కనిపిస్తుంటే, ఇక్కడ 'సుధ ', 'నీ' పాత్రలలో నీ వర్ణన, ఆయా పాత్రల స్వబావాన్ని కూడా చక్కగా ప్రతిబింబిస్తున్నాయి... చాలా బాగుంది... అందరిలాగానే తరువాత పోస్ట్ కోసం నేనూ ఎదురుచూస్తున్నాను.
రిప్లయితొలగించండిభారారె గారూ మీరు వింటున్నారా....! ? నేను చదువుతున్నారనుకున్నానే ! ?
రిప్లయితొలగించండిsmily..గారూ సారీ అండి....
రిప్లయితొలగించండికాని..... ,జీవితగమనంలో చీకటి-వెలుగులు పక్క,పక్కనే వుంటాయిగదా !
వాఖ్యకు కృతజ్ఞతలు.
Kishen మీరు మరీను.....ఇందులో అంత సస్పెన్స్ ఏముందండీ.
రిప్లయితొలగించండిమీ 'ఆకాశ వీధిలో' 'ఆశల రెక్కలు' ల్లాగా అనుభవాలేనండీ అంతా...
సత్యనారాయణ గారూ... మీ అభినందనపూర్వక వాఖ్యకు ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించండిసాంకేతిక,వ్యక్తిగత అవాంతరాలు కలిసి రావడం వలన, పోస్ట్ల్ లు ఆలశ్యమవుతున్నాయండీ. అందుకు అందరూ క్షమించాలి.
సాంకేతిక వ్యక్తిగత అవాంతరాలా ?? ## !! @@...అబ్బో ఏమిటో అవి....ఎవైనా కానీ కనీసం వారానికి రెండు పోస్టులు ఉండాలి వెన్నెల ...అంతే...అలా అని ఈ కిషెన్ శాసిస్తున్నాడు..మా వెన్నెల పాటిస్తుంది....అంతేనా??
రిప్లయితొలగించండి