13.ఎలుకల కూర-మ్యాంగో పికిల్

ఇంకో రెండు రోజులు అలానే గడిచాయి..

తరవాతి రోజు ఉదయం 11 గంటలకి.. నాకు పుస్తకం ముందున్నా 'రిమా' గురించే ఆలోచనలు..

తనని మరీ ఎక్కువ భాధ పెడుతున్నానేమో అని. నాకు తనతో పరిచయం అయ్యి నాలుగేళ్ళు అవుతుంది.. కానీ మొదటినుండీ ఈ స్నేహం వింతగానూ,ఇంకా అదేదో చెప్పలేని ఫీలింగ్..
తను నన్ను ఇష్టపడ్డంత నేను తనని ఇష్టపడలేదేమో అనిపిస్తుంది నాకు, అంతేకాదు తను నాతో ఉన్నంత ఫ్రీగా నేను వుండలేకపోయేదాన్ని, తను చెప్పినంత ఓపెన్ గా నా మనసులో విషయాలు తనతో చెప్పలేక పోయేదాన్ని, నాకెందుకో తను నాకోసం ఏది చేసినా అది ఓవర్ గా అనిపించేది, అంతేకాదు తనతో స్నేహం చేయడానికి కూడా నేనేదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని, వీటన్నిటికి కారణాలు లేకపోలేదు..

తనకు నాకు వున్న age diffrent మొదటికారణం.

language రెండో కారణం తను తమిళ్,తెలుగు,హింది,ఇంగ్లీష్,ఏ language లో మాట్లాడినా నేను అర్దం చేసుకోగలిగేదాన్ని కానీ తిరిగి తనతో మాట్లాడటానికి నాకు తెలుగు తప్ప ఇంకో బాష వచ్చేది కాదు.

మూడోకారణం ఇన్ని రోజులు గడిచినా తను మా అమ్మ,నాన్నలతో మాట్లాడానికి భయపడటం.

నాలుగో కారణం తనకు వాళ్ళ అమ్మమీదున్న ప్రేమఅంతా నా మీద చూపించడాన్ని కూడా నేను తట్టుకోలేకపోతున్నాను.
ఈ అతి(ఎక్కువ)ప్రేమతో తను చేసే పనులు నాకు ఇంకా అతిగా అనిపించేయి. ఒక్కో సారి చిరాకుగా కూడా వుండేది, ఇంకొకసారి తన పరిస్తితి సరిగా అర్దం చేసుకోకుండా తప్పుగా ప్రవర్తిస్తున్నానేమో అనిపించేది.
నేను ఇలా ఆలోచిస్తుండగానే...

ఫోన్ మోగింది... లిఫ్ట్ చేయగానే

"నేను ఇంటిముందున్నా" అంది.సీరియస్ గా..
నేను అంతే సీరియస్ గా "లోపలికి రా " అని పోన్ పెట్టేసాను.
వస్తూనే "నీకు ఎందుకంత కోపం.. నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నవ్"అంది.
"నువ్వు చేసే తిక్క పనులకి కోపం రాదా మరి"
"తిక్క పనేమీ కాదు నాకు అప్పుడు అలా అనిపించింది అప్పుడే కాదు ఇప్పుడూ అలానే అనిపిస్తుందనుకో.."
"రెండు తంతే ఇంకా బాగా అనిపిస్తుంది." అని చెయ్యెత్తాను.
"నన్ను కొట్టడానికి నువ్వెవరివి..?"
"ఎవరనుకొని నువ్వు నాతో మాట్లాడుతున్నావ్"
"మా అమ్మవనుకొని"
"అయితే నేను మీ అమ్మనే కదా నాకు నిన్ను కొట్టే రైట్ ఉంది."
"అహా అలానా ? కొట్టే రైట్ వుంది కానీ.. నా మ్యారేజ్ కి వచ్చే బాధ్యత లేదా..?"
"డైలాగులు కొట్టకు నాకు మండిపోతుంది"
"ఎందుకే ఇంత రాక్షసిలా తయారవుతున్నావు."
"నిన్ను భరించాలంటే రాక్షసిలానే ఉండాలి"
"ఆహా ఇదవరకు ఎలా ఉండేదానివి...? అమాయకంగా, భయం భయంగా..అక్కా..అక్కా అనుకుంటు... ఇప్పుడేమో ఇలా మొండి దానిలా తయారయ్యావు".
"నాలుగేళ్ళుగా నీతో వుంటున్నానుగా నీ మొండితనం, రాక్షస లక్షణాలు నాకూ వచ్చాయి".
"మాటకి మాట బాగా చెబుతున్నావ్"
"అవును చెబుతాను... ఇప్పుడు ఏమంటావ్."
(ఇలా కోపంగా తిట్టుకుంటున్నామో చనువుగా మాట్లాడుకుంటున్నమో అర్దం కానట్టుగా సాగిపోతుంది మాసంభాషణ.)
"నేనేమంటానే తల్లీ నీతో మాట్లాడేసరికి నాకు ఆకలేస్తుంది ఇంట్లో ఏమయినా వుందా..?"
"బయట గడ్డి వుంది తెమ్మంటావా..?"
"ఆ "
"గడ్డి.... గ్రాస్ తెమ్మంటవా..?"
"ఆ తీసుకురా ఏదో ఒకటి అసలే 3days నుండీ ఏమీ తినడం లేదు"
"ఏ ఏమొచ్చింది."
"నువ్వు అలా మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంటే ఎలా తినబుద్దేస్తుంది".
(నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి... ఎమనలో అర్దం కాలేదు.)
"సంతోషించాంలే..! తెలివి బాగా ఎక్కువయ్యింది. ఇందుకు కాదు నిన్ను కొడతాననేది." అంటూ వంటింట్లోకి వెళ్ళాను
"ఊ...ఆపు ఇంక... తిట్లతో కడుపు నింపేస్తున్నవు."
"అసలే నాకు వుడుకుమోత్తనం ఎక్కువ నీ తిక్క చేష్టలతో నన్ను ఇంకా రెచ్చగొట్టకు"
"ఎలుకల కూర తింటావా "
"అంటే"
"ఆ... ర్యాట్ కర్రీ వచ్చి చూడు"
"ర్యాట్ కర్రీ..ఆ అది కూడా చేస్తారా...మీ ఇంట్లో"
"ఏ మీ ఇంట్లో చెయ్యరా..?"
"ఏది "
"ఇదిగో.. అంటూ గిన్నేలోనుండి ఆ ఎలుక తోక పట్టుకొని పైకి ఎత్తి చూపించాను."
"this is look like rat only,but this is not rat am right !? " అంది.
"అహా చేసావులే గొప్ప ఇన్వెస్టిగేషన్ ఇది కాకరగాయ.."
"కాకరగాయ్..!? దీన్ని ఎలా చేస్తారు..?"
"ఊ..చేత్తో.. తింటావా లేదా చెప్పు "
"తింటానులేకానీ ఇదేంటి..?" అంటూ వేరే గిన్నెమూత తీసింది.
"అది మామిడికాయకారం అంటే మ్యాంగో పికిల్ వెయ్యనా..?
"ఆ.. ఆ..వెయ్యి "
"నీ తిక్క కుదరాలంటే ఇదే రైట్" అని మామిడికాయ కారం వేసి ఎర్రగా కలిపి "ఊ పట్టు" అంటూ అన్నం కలిపి నోట్లో పెట్టాను.
"వావ్ సూపర్ ! "
"ఏంటి కారంగా లేదా"
"లేదు నీ చేత్తో పెట్టావుగా.."
"అయితే నువ్వే తిను"
"ఎందుకు..!?"
"నీకు కారంగా అనిపించాలనే కదా ఇంత ఎర్రగా కలిపింది.అందుకనే నువ్వే తిను."
"ఆ అలా అయితే చాలా కారంగా ఉంది అబ్బా..ఉ...ష్...!"
"నాటకాలు ఆపి కుదురుగా కూర్చోని తింటావా ..!?
"నాకు అన్నం అలా ఒకచోట కూర్చోని తినడం ఇష్టముండదు".
"అలా తిరుక్కుంటూ తినడం నాకు ఇష్టముండదు. వచ్చి కూర్చో".
"సరే నీ ఇష్టం కానీ ప్లీజ్ ఈ చైర్లో కూర్చోను... కావాలంటే ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా .."
"దాని మీద కూర్చోంటే అది విరుగుతుంది అప్పుడు మా అమ్మ నన్ను ఇరగదీస్తుంది".
"ఓ రియల్లీ..! అయితే ఇక్కడే కూర్చుంటాను".
"సరేలే ఎక్కడో ఒక చోట కూర్చో ముందు అన్నం తిను".
"మర్చిపోయాను అసలు నేను ఇక్కడికి ఒక ఇంపార్టేంట్ పని మీద వచ్చాను".
"ఇంపార్టేంట్ పనా ..? ఏమిటది..?"
"...... ఏమిటంటే "

12 కామెంట్‌లు:

  1. mee vyipu aalocinci rimaani paapam anaaloa, rimaa vyipu aalocinci mimmalni paapam anaaloa teliyadam ledu

    రిప్లయితొలగించండి
  2. వెన్నెలా
    నీ మనః సంఘర్షనను వర్ణించి చెప్పిన తీరు బాగుందమ్మ. కానీ ఇలాంటి కారణాలు ఎన్ని వున్నా మధురమయిన స్నేహానికి అవి అడ్డంకాలేవు కదా ?

    రిప్లయితొలగించండి
  3. అశోక్ చౌదరి గారు,భా రా రే గారు ఎమిటంటే..........? కొంచం ఆగండి మీకే తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. భా రా రే గారు మీ హృదయ స్పందనల చిరుసవ్వడులు మాకు ఎందువలనో స్పందించుటలేదు....! కారణము ఎమైవుటుందంటారు..?

    రిప్లయితొలగించండి
  5. smily గారు.. చిన్నపిల్లను కదా నన్నే కొంచం ఎక్కువ 'పాపం' అనుకోండి

    రిప్లయితొలగించండి
  6. సత్యనారయణ గారు ధన్యవాదాలండి.
    కారణాలు స్నేహానికి అడ్డుకాలేదండి మాస్నేహ ఉనికికి,గమనానికి అడ్డు అయ్యాయి.

    రిప్లయితొలగించండి
  7. >>భా రా రే గారు మీ హృదయ స్పందనల చిరుసవ్వడులు మాకు ఎందువలనో స్పందించుటలేదు....! కారణము ఎమైవుటుందంటారు..?

    అవునా? So, what do you think? What could be the reason? Guess it.

    రిప్లయితొలగించండి
  8. నాకంత టాలెంట్ లేదు కానీ పప్పులు ఉడికాయనుకొని చెప్పండి.

    రిప్లయితొలగించండి
  9. chaavagodutunnav. mottaM okka saarea post cheyochugadaa.

    bodlapati srinivasa rao

    sreenadu@gmail.com

    రిప్లయితొలగించండి
  10. వెన్నెలా!
    మీ రిమాక్క చెప్పిన ముఖ్యమైన పనేదో తొందరగా చెప్పమ్మా టెన్షన్& సస్పెన్స్ తో చంపేస్తున్నావ్.
    ఎన్నో నవల్స్,కథలు,సీరియల్స్ చదివాను కానీ ఇంతగా ఎప్పుడూ ఎదురు చూడలేదు

    రిప్లయితొలగించండి